తల్లికి వందనం పథకం 2026 విడుదల తేదీ వచ్చేసింది… మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా | AP Talliki Vandanam Scheme 2026 Release Date
తల్లికి వందనం పథకం 2026 విడుదల తేదీ వచ్చేసింది… మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా | AP Talliki Vandanam Scheme 2026 Release Date
AP Talliki Vandanam Scheme 2026 Release Date : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు మరియు తల్లుల కూ శుభవార్త తెలియజేశారు. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10వ తేదీన తల్లికి వందనం రాష్ట్రవ్యాప్తంగా స్కూలు మరియు కళాశాలకు వెళ్లే అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాలో రూ.13,000/- 2026-27 విద్య సంవత్సరం నిధులు జమ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. తల్లి వందనం నిధులకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు, కొత్త నిబంధనలపై స్పష్టత మరియు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో చదువుతున్న 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు తల్లుల బ్యాంకు ఖాతాలో 10 జూలై 2026న తల్లికి వందన నిధులు ప్రభుత్వం డైరెక్టర్గా DBT రూపంలో జమ చేయనున్నది. DBT అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది. గతంలో నిబంధనల ప్రకారం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి విడివిడిగా తల్లివందనం వర్తిస్తుందని తెలియజేశారు. దీని ద్వారా లక్షలాదిమందికి పేద కుటుంబాల భారీ ఆర్థిక సహాయం పలుకుతుంది.
తల్లికి వందనం రావాలి అంటే తప్పనిసరిగా విద్యార్థులు స్కూల్ అటెండెన్స్ 75% ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఈకేవైసీ మరియు NPCI మ్యాపింగ్ యాక్టివ్ గా ఉండాలి. ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే, టైం ఉంది కాబట్టి సరి చేసుకోండి. అలాగే తల్లుల తమ బ్యాంకు అకౌంట్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. పై చెప్పిన నిబంధనలు అన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే జూలై 10 తేదీన అర్హులైన తల్లుల యొక్క ఖాతాలలో నేరుగా రూ.13000/- జమ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం మీ గ్రామ వార్డు సచివాలయంలో విద్యా సహాయకులు లేదా పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మీరు అర్హుల జాబితాలో ఉన్నారు లేదో తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment